Megastar Chiranjeevi: ‘ఆ విషయంలో వెలితిగా ఫీలయ్యి ట్వీట్ చేస్తున్నాను’.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర పోస్ట్..

|

Dec 28, 2022 | 12:21 PM

ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో అందరి గురించి ప్రస్తావించిన చిరంజీవి.. కీలకపాత్రలో నటించిన రవితేజ గురించి చెప్పడం మర్చిపోయారు. దీంతో చిరు, రవితేజ మధ్య ఏదైనా జరిగిందా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

Megastar Chiranjeevi: ఆ విషయంలో వెలితిగా ఫీలయ్యి ట్వీట్ చేస్తున్నాను.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర పోస్ట్..
Megastar Chiranjeevi
Follow us on

చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ అవతారంలో బాక్సాఫీస్‏ను షేక్ చేసేందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన వీరాభిమాని డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య.. ఈ సంక్రాంతికి జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ నెట్టింట్లో సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో అందరి గురించి ప్రస్తావించిన చిరంజీవి.. కీలకపాత్రలో నటించిన రవితేజ గురించి చెప్పడం మర్చిపోయారు. దీంతో చిరు, రవితేజ మధ్య ఏదైనా జరిగిందా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వెంటనే జరిగిన పొరపాటును గుర్తించిన చిరంజీవి మాస్ మాహారాజా గురించి ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు.

జరిగిన విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ నోట్ విడుదల చేశారు. అందులో “వాల్తేరు వీరయ్య టీం అందరితో మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రం విడుదలకు ఎంతో ముందు జరిగినా.. టీం అందరూ ఎంతో సంతోషంగా ఈ జర్నీలో వాళ్ల వాళ్ల మెమొరీస్ ను పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత సంతృప్తిగా జరిగింది. అయితే నా వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడుదామని అనుకోవడంతో చిత్రంగా నా తమ్ముడు.. వీరయ్యకు అతి ముఖ్యుడు అయిన రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఈ విషయమై అంతా వెలితిగా ఫీలయ్యి ఈ ట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రాజెక్ట్ గురించి అన్నయ్య సినిమాలో చేయాలని చెప్పగానే రవి వెంటనే ఒప్పుకోవడం దగ్గర్నుంచి కలిసి షూట్ చేసిన ప్రతిరోజూ రవితో ఇన్నేళ్లకు కలిసి సినిమా చేయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవి చేయ్యకపోయుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. డైరెక్టర్ బాబీ అంటున్న పూనకాలు లోడింగ్ లో రవితేజ పాత్ర చాలా ఉంది. ఈ విషయాలు త్వరలోనే మాట్లాడుకుందాం. ” అంటూ రాసుకొచ్చారు చిరు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.