
కోట్లాది భారతీయుల శతాబ్ధాల నిరీక్షణకు తెరపడింది. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన ఘట్టం.. ఎట్టకేలకు తన జన్మభూమి అయోధ్యలో బాలరాముడిగా శ్రీరాముడి కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) ప్రధాన మంత్రి నరేంద్రమోది చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈవేడుకలకు సినీ, రాజకీయ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు రూ. 8 వేల మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హజరయ్యారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్, కోలీవుడ్ హీరో ధనుష్ సైతం హాజరై బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్ నిన్నటి నుంచి నెట్టింట వైరలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఓ ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్శించింది. అదే మెగా సెల్ఫీ.
రామమందిర ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, చరణ్ లు ఓ సెల్ఫీ తీసుకున్నారు. చిరు, చరణ్ మధ్యలో ధనుష్ ఉండగా.. ముగ్గురు చిరునవ్వుతో కనిపించారు. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఫోటోను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలా ఓ సినిమా కూడా ప్లాన్ చేయొచ్చుగా బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు చిరంజీవి, రామ్ చరణ్ బిజినెస్ మ్యాన్ అనిల్ అంబానీతో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. అలాగే కెప్టెన్ మిల్లర్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు ధనుష్. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా జనవరి 26న తెలుగులో విడుదల కానుంది. నిజానికి ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటికే తెలుగులో వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో కెప్టెన్ మిల్లర్ వెనక్కు తగ్గింది. ఇక చిరు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.