Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా టికెట్స్ రేట్స్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..
Megastar Chiranjeevi

Updated on: Dec 25, 2021 | 12:34 PM

సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా టికెట్స్ రేట్స్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు ఒక్కోక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో టికెట్స్ ధరల విషయంలో థియేటర్ల యాజమానులకు, నిర్మాతలకు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనే విషయంలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు వీలుగు శుక్రవారం జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెగాస్టార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు చిరు. ” తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది.” అంటూ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను షేర్ చేశారు.

ట్వీట్..

సినిమా విడుదల సమయంలో టికెట్స్ పెంచుకునేందుకు నిర్మాతలకు అవకాశం కల్పించింది. ఈ జీవో ప్రకారం ఏసీ థియేటర్లలో రూ. 50 నుంచి 150 వరకు టికెట్స్ రేట్ ఉండే అవకాశం ఉంది. అలాగే మల్టీప్లెక్స్‏లో వందకు పైగా టికెట్ ధర ఉండనుంది.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..