జంబలకిడి జారు మిఠాయా.. కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పాట గురించి వచ్చిన మీమ్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాగే.. నెట్టింట తెగ హల్చల్ చేసింది. అయితే ఈ పాటను మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించిన జిన్నా సినిమాలో స్పెషల్ సాంగ్ గా చేశారు. చిత్తూరు ప్రాంతంలో పాడుకునే జానపద పాటను ఎంచుకుని దానికి మ్యూజిక్ టచ్ ఇచ్చి సినిమాలో యాడ్ చేశారు. ఈ పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సాంగ్ ఒరిజినల్ గా పాడిన ఇద్దరు మహిళలు తీసుకురావడం.. వారిద్దరు ఈ పాటలను పాడడం హైలెట్ అయ్యింది. వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. చీర కడతా చూడు.. నేను చీర కడతా చూడు.. నా చీర సాయి చూడకుంటే తీసేస్తా చూడూ అంటూ ఆమె పాడిన పాటకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాటను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పాడారు.
వాల్తేరు వీరయ్య.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇందులో చాలా కాలం అనంతరం.. మాస్ అండ్ యాక్షన్ అవతారంలో అదరగొట్టారు చిరంజీవి. ఈ సినిమాలో ఓ సందర్భంలో చిరంజీవి జారు మిఠయా పాడను పాడారు. నేను లుంగీ కడతా సూడు.. నే లుంగీ కట్ట్యా సూడు. నా లుంగీ సైడు సూడకపోతే ఇప్పేస్తాను సూడు.. అంటూ తనదైన మాస్ కామెడీ స్టైల్లో పాడారు చిరు. ఇక ఈ సన్నివేశం వస్తున్నప్పుడు థియేటర్లలో అరుపులు, కేకలతో రచ్చ చేశారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా నెట్టింట వైరలవుతున్నాయి.
అలాగే అన్నయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం.. రవితేజ, చిరు కలిసి స్క్రిన్ షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించింది. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ రూపొందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.