Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారు.

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..
Megastar Chiranjeevi

Updated on: May 27, 2021 | 6:57 PM

Megastar Chiranjeevi:

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారు. అలాగే ఆచార్య సినిమాలో కీలక పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టిస్తున్నారు. చిరుకు జోడీగా కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’  రీమేక్ లో చేయనున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఆ తరువాత ‘వేదాళం’ రీమేక్ బాధ్యతలను మెహర్ రమేశ్ కు అప్పగించారు మెగాస్టార్. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలు ముందుగా సుజీత్ కు అప్పగించారు. కొన్ని అనివార్య కారణాలతో సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడంతో.. ఈ సినిమా మోహన్ రాజా చేతికి వెళ్ళింది.

అయితే ఇప్పుడు మరోసారి సుజిత్ కు మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. అజిత్ హీరోగా చేసిన ‘ఎన్నై అరిందాళ్’ సినిమాకి రీమేక్. ‘ఎంతవాడుగానీ’ పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదలైంది కూడా. అయినా చిరూ ఈ సినిమా రీమేక్ పట్ల ఉత్సాహాన్ని చూపించారట. ఈ స్క్రిప్టు బాధ్యతను సుజీత్ కు అప్పజెప్పనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda Video : విజయ్ దేవరకొండ ను రిజెక్ట్ చేసిన 25 మంది హీరోయిన్లు.. రౌడీ క్రేజ్ తగ్గినట్టేనా…?

RRR Movie: ప్ర‌పంచం మొత్తం చుట్టేయ‌నున్న తెలుగు సినిమా.. రాజ‌మౌళి కొత్త ఎత్తుగ‌డ‌.. ఏకంగా ఐదు అంత‌ర్జాతీయ‌ భాష‌ల్లో..