CM Revanth Reddy- Chiranjeevi: ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్..

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి సైతం ఆ దేశంలోని జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సీఎం సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో చిరు ఆ సదస్సుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

CM Revanth Reddy- Chiranjeevi: ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోస్..
Cm Revanth Reddy, Chiranjee

Updated on: Jan 21, 2026 | 11:54 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని Zurich లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయనను సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి గారు సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవి గారితో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా ఈ సదస్సు సందర్భంగా స్నేహపూర్వకంగా కలుసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతుంది. మరోవైపు విశ్వంభర చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..