Chiranjeevi – Jagan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదానికి తెర దించేందుకు ఎట్టకేలకు చిరంజీవి రంగంలోకి దిగారు. సినిమా పెద్దగా కాదు.. సినిమా బిడ్డగా అంటూ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సీఎం జగన్ భేటీతో ఇటు టికెట్ ధరలు, అటు థియేటర్ల మూసివేతపై ఓ క్లారిటీ తీసుకొచ్చేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు మెట్లెక్కారు. సీఎంతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు.
ఇక గంటన్నర భేటీ తర్వాత.. మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. సీఎం జగన్ ఆహ్వానం మేరకు.. ఇండస్ట్రీ బిడ్డగా విజయవాడ వచ్చానని చెప్పారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందంటూ ఖుషీ కబురు చెప్పారు చిరు. టికెట్ ధరలపై సంక్రాంతి కానుకగా కొత్త జీవో వస్తుందని ఆశాభావం వ‌్యక్తం చేశారు. ఎక్స్‌ట్రాషో, బెనిఫిట్ షోలకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందన్నారు. థియేటర్ల నిర్వహణ సమస్యలకు సంబంధించి కూడా గుడ్‌న్యూస్ ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు మన మెగాస్టార్. అంతేకాదు.. సినిమా సమస్యలపై వివరించేందుకు సీఎం జగన్‌ను.. అవసరమైతే మళ్లీ కలుస్తానన్నారు చిరంజీవి. అవసరమైతే.. మరోసారి లంచ్ టైమ్‌లోనే కలవాలని సీఎం కూడా చెప్పారన్నారు. సీఎం ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చెప్పిన విషయాలన్నీ.. కమిటీకి వివరిస్తానని సీఎం చెప్పినట్టు చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆలోపు సినిమాలోని అన్ని వర్గాల వారితో చర్చిస్తానని చెప్పారు చిరంజీవి.
ఇక సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై నాగార్జున స్పందించారు. తన సినిమా విడుదల ఉండటం వల్ల చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయాయని అన్నారు. మా అందరి కోసం సీఎంతో చిరంజీవి సమావేశమయ్యారని అన్నారు.
టికెట్ ఫైట్ సినిమా ట్విస్ట్‌లను మించిపోయింది. జీవో నంబర్ 35 జారీ అయినప్పటినుంచి ఏపీ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. జీవో మొదట్లో ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఆచితూచి మాట్లాడారు. అయితే హీరోనాని ఎప్పుడైతే కిరాణాకొట్టు కామెంట్లు చేశారో అప్పడు మొదలైంది అసలు వివాదం. కిరాణాకొట్టు కామెంట్లు నుంచి ఎమ్మార్పీ, ఆపై రెమ్యూనరేషన్, సన్మానాల దాకా వెళ్లింది సిట్యువేషన్. అంతేకాదు మంత్రి పేర్నినాని-ఆర్జీవీ ట్వీట్‌వార్, ఫేస్ టు ఫేస్ కూడా ఆధ్యంతం రక్తికట్టించింది. మొత్తానికి మలుపులు, మెరుపుల మధ్య సీఎం జగన్‌తో చిరు భేటీ అయ్యారు.. సమస్యకు ముగింపు పలకనున్నారు.
Also read:
Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..
Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాల్లో భారీ మోసం.. ఎలా గుర్తించారంటే..
Viral Video: ఈ అమ్మాయి చూడటానికే ఫ్లవర్‌లా ఉంటది.. పంచ్‌లు మాత్రం ఫైర్.. చూస్తే మతిపోవాల్సిందే!