
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్‌కు చిరంజీవి చేయూత అందించారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌ల కోసం అసోసియేషన్ చేస్తోన్న కార్యక్రమాలను మెచ్చుకొన్న చిరంజీవి.. ఆ అసోషియేషన్‌కు తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. భవిష్యత్తులో సభ్యుల శ్రేషస్సు కోసం కూడా ఎలాంటి సహాయం చేయడానికైనా ముందు ఉంటానని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్‌లు హర్షం వ్యక్తం చేశారు.