మెగా ర్యాలీతో దద్దరిల్లిపోతున్న అనంతపూర్.. అప్పుడే హంగామా మొదలైంది. చిరు ఫ్యాన్స్ లో జోష్ పొంగి పొర్లుతోంది. చిరు రాకకోసం ఇప్పటి నుంచే వెయిటింగ్ ఎక్కువైంది. బాసును చూడాలనే ఈగర్ అందరిలో పెరిగిపోతోంది. చిరు గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న అనంతపూర్‌లో అంటూ.. ఎప్పుడూతే ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి.. అనంతపూర్ లో హంగామా మొదలైంది. ఇక ఆరోజు దగ్గరపడుతుండడంతో.. ఆ హంగామా మరింత తీవ్రమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ చిరుకు వెల్ కమ్ చెబుతూ.. ఓ మెగా ర్యాలీని స్టార్ట్ చేశారు. డప్పు చప్పుల్లతో.. మెగా స్టార్ నినాదాలతో.. బాసు బ్యానర్లతో.. అనంతపూర్‌ను దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. సెప్టెంబర్ 28నే మన ముందుకు వచ్చేస్తున్నారు మెగాస్టార్. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని.. తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు.
అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మెగాస్టార్, సల్మాన్ కలిసి ఒక పాటల్లోనూ స్టెప్పులేసి అలరించనున్నారు.
ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదులుతున్న మెగాస్టార్ పోస్టర్లు అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రీరిలీజ్ కోసం అనంతపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు.. ఈ సినిమానే కాకుండా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ చిరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.