Chiranjeevi: పోతరాజు స్టెప్‌ వేసిన మెగాస్టార్‌.. గాడ్‌ ఫాదర్‌ గ్రేస్‌ను చూసి సంబరపడిపోతోన్న ఫ్యాన్స్‌

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ సంప్రదాయమైన పోతరాజు స్టెప్‌ వేసి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Chiranjeevi: పోతరాజు స్టెప్‌ వేసిన మెగాస్టార్‌.. గాడ్‌ ఫాదర్‌ గ్రేస్‌ను చూసి సంబరపడిపోతోన్న ఫ్యాన్స్‌
Godfather

Updated on: Oct 08, 2022 | 6:03 AM

తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు దక్షిణ సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్‌కు ఒక క్రేజ్‌ తీసుకొచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. ఒక సినిమాలో చెప్పినట్లు డ్యాన్స్‌ అంటే కాళ్లు చేతలు ఊపడం కాదు.. గ్రేస్‌ జోడించి స్టెప్పులు వేయడం ఆయనకు మాత్రమే సాధ్యం. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడానికి తన డ్యాన్స్‌ కూడా ఒక కారణం. హిట్లర్‌ సినిమాలోని నడక కలిసిన నవరాత్రి, ఇంద్ర సినిమాలోని దాయిదాయి దామా వీణ స్టెప్‌ ఆయన డ్యాన్స్‌కు కొన్ని మచ్చుతునకలు. ఇలాంటివి ఎన్నో ఆయన సినిమా కెరీర్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ సంప్రదాయమైన పోతరాజు స్టెప్‌ వేసి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. దసరా ఉత్సవాల సందర్భంగా హర్యాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసారి చిరంజీవి కూడా అతిథిగా హాజరై హాజరై స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

గాడ్ ఫాదర్‌ రికార్డుల పర్వం..

ఇక కార్యక్రమంలో భాగంగా కళాకారులు, ప్రజలు, అభిమానులతో కలిసి పోతరాజు స్టెప్‌ వేసి అలరించారు చిరంజీవి. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను చూసి మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక దసరాకు గాడ్‌ఫాదర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్‌. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజే వరల్డ్ వైడ్ 38 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన ఈ మెగా ఎంటర్‌టైనర్‌ తాజాగా 70 కోట్ల మార్క్‌ను అందుకుందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గాడ్‌ఫాదర్‌ సినిమాలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, మురళీ శర్మ, సముద్రఖని, అనసూయ, సునీల్‌ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ అందించిన బీజీఎం సినిమాకు మరొకస్థాయిని తీసుకెళ్లిందని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీ కానున్నారు మెగాస్టార్‌. కే.ఎస్. రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రతిష్ఠాత్మక మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..