
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయనను అభిమానించేవారు కోట్లాది మంది. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమే. ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీనటులు అడుగుపెట్టారు. ముఖ్యంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రతి కుర్రాడికి స్పూర్తి చిరు. అందుకే ఆయనను అంతా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఇండస్ట్రీలో చిరు అంటే అమితంగా ఇష్టపడేవారిలో ఒకరు మాస్ మాహారాజా రవితేజ.. మరొకరు శ్రీకాంత్. వీరి కాంబోలోనూ సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. చిరంజీవి, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో చిరు తమ్ముడు ఏటీఎం పాత్రలో నటించి అలరించారు. వీరిద్దరి కామెడీ.. ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాలేదు. అయితే అప్పుడప్పుడు శ్రీకాంత్, చిరు కలుస్తుంటారు. తాజాగా నిన్న శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు చిరు. స్వయంగా శ్రీకాంత్ ఇంటికి కేక్ తీసుకుని వెళ్లి కేక్ కట్ చేయించి తినిపించారు. అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. కేక్ పై హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం మరింత విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.