Chiranjeevi: జోరు పెంచిన చిరు..శరవేగంగా మెగాస్టార్ 154 మూవీ షూటింగ్

|

Sep 03, 2022 | 6:30 AM

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాతోసాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాయి.

Chiranjeevi: జోరు పెంచిన చిరు..శరవేగంగా మెగాస్టార్ 154 మూవీ షూటింగ్
Mega154
Follow us on

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ఖైదీ 150 సినిమాతోసాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాయి. మెగాస్టార్ 151 గా వచ్చిన సైరా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రియాడికల్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా దారుణంగా నిరాశపరిచింది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా మెగాస్టార్ భారీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మెగాస్టార్ కూడా డే పనిలో ఉన్నారు.

ఇప్పటికే వరుసగా మూడు సినిమాలను లైనప్ చేశారు చిరు. వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వేదాళం సినిమాకు రీమేక్. వీటితో పాటు బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే మాస్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక శరవేగంగా ఈ మూవీ షూటింగ్ ను పుతి చేస్తున్నారు చిరు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యం భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఈ నేపథ్యంలో శుక్రావారం చిరు – బాబీల మూవీ కీలక షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు దర్శకుడు బాబీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..