
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. భోళా శంకర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అందులో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మనశంకర వరప్రసాద్ గారు ముందుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మెగా మూవీలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. . ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు విశ్వంభర సినిమాను కూడా చిరంజీవి పూర్తి చేయాల్సి ఉంది. అలాగే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కే.ఎస్. రవీంద్ర తో మరో సినిమాకు రెడీ అయ్యారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు చిరంజీవి.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మేనేజర్ కుమార్తె బారసాల వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకకు హాజరైన చిరంజీవి మేనేజర్ కుమార్తెకు కానుకలు అందించారు. అనంతరం ఆ చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025
Many Many Happy Returns of the Day to my Director @AnilRavipudi 💐💐
Your warmth on set and your joyous filmmaking style make every moment special.
Excited to celebrate the festive magic with you and our #ManaShankaraVaraPrasadGaru team this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/lQ3FzAHRBk
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి