
దేశ ఆర్ధిక రాజధాని ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేడుకలో భారత చలన చిత్ర సీమకు సంబంధించిన ప్రముఖులు పాల్గోన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌లో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ సహా ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తన బాల్యం.. సినిమాల మీద ఉన్న ఆసక్తిని గురించి పలు విషయాలను పంచుకున్నారు. తాను బాల్యంలో ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌ను ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై తనకు ఆసక్తి మొదలైందని చెప్పారు. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానని.. అయితే అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. ఇలా అర డజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వీరందరి మధ్య తనకు అసలు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందా అని ఆలోచిస్తూ ఉండేవాడినని చెప్పారు.
అప్పుడే తన మనసులో అందరికంటే భిన్నంగా ఏమీ చేయగలను అని ఆలోచించాను.. ఇలా అందరికంటే భిన్నంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా సినిమాల్లో అవకాశం వస్తుందని భావించి.. అప్పుడే ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నానని చెప్పారు చిరంజీవి. అవే ఇప్పుడు తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని చెప్పారు. అంతేకాదు తనకు సినిమాల్లో నటించే విషయంలో కూడా పలువురు హీరోలను స్పూర్తిగా తీసుకున్నట్లు.. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో మిథున్ చక్రవర్తి , ఫైట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో కమల్ హాసన్ లను తాను స్పూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను తనని తాను ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..