Chiranjeevi – Sivaji: అదరగొట్టావయ్యా శివాజీ.. మంగపతిని ఇంటికి పిలిపించి సత్కరించిన మెగాస్టార్.. ఫొటోస్‌

తన సినిమాలనే కాదు మంచి సినిమాలు చేసే ప్రతి ఒక్కరినీ మనసారా అభినందిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. వారిని ఇంటికి పిలిపించి మరీ సత్కరిస్తుంటారు. అలా తాజాగా శివాజీని ఇంటికి పిలిపించి సత్కరించారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Chiranjeevi – Sivaji: అదరగొట్టావయ్యా శివాజీ.. మంగపతిని ఇంటికి పిలిపించి సత్కరించిన మెగాస్టార్.. ఫొటోస్‌
Chiranjeevi, Sivaji

Updated on: Mar 30, 2025 | 8:53 AM

ఒకప్పుడు హీరోగా, కామెడీ హీరోగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాడు శివాజీ. కొందరు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆకట్టుకున్నాడు. అయితే మధ్యలో రాజకీయాలంటూ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మరోసారి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నాడు శివాజీ. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన కోర్టు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంగపతి అనే విలన్ పాత్రలో అదరగొట్టాడు శివాజీ. కేవలం మాటలు, చూపులతోనే అందరినీ భయ పెట్టాడు. కోర్టు సినిమాతో పాటు శివాజీ మంగ పతి పాత్ర కూడా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగపతి పాత్రకు వస్తోన్న రెస్పాన్స్ చూసి శివాజీ కూడా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ క్రమంలో మంచి సినిమాలను, ట్యాలెంటెడ్ నటీనటులను ప్రోత్సహించడంలో ముందుండే మెగాస్టార్ శివాజీని ప్రత్యేకంగా అభినందించారు. అతనిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకున్న శివాజీ ‘మంగపతి పాత్రలో జీవించావయ్యా’ అని అభినందించారు.

ఇక మెగాస్టార్ ఇంటికి పిలిచి అభినందించడంతో శివాజీ ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ సందర్భంగా చిరంజీవితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకొన్నాడు. అనంతరం తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిరంజీవితో శివాజీ సెల్ఫీలు తీసుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో చిరంజీవి నటించిన మాస్టర్, ఇంద్ర సినిమాల్లో శివాజీ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం శివాజీ చేతిలో పలు సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండి పోతుంది..

మెగాస్టార్ చిరంజీవితో శివాజీ సెల్ఫీలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.