Chiranjeevi: బేబీ టీమ్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. నా దేవుడు అంటూ ఎమోషనల్ అయిన దర్శకుడు

సాయి రాజేష్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. అలాగే ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో వైష్ణవి తన నటనతో ఆకట్టుకుంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ జులై 14న విడుదలైన ఇప్పటికీ హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Chiranjeevi: బేబీ టీమ్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. నా దేవుడు అంటూ ఎమోషనల్ అయిన దర్శకుడు
Chiranjeevi

Updated on: Jul 28, 2023 | 5:57 PM

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ బేబీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బేబీ. సాయి రాజేష్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. అలాగే ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో వైష్ణవి తన నటనతో ఆకట్టుకుంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ జులై 14న విడుదలైన ఇప్పటికీ హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. అలాగే బేబీ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఇప్పటికే ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. బేబీ సినిమా పై స్టార్ హీరోలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవి నటన గురించి అందరూ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బేబీ చిత్రయూనిట్ ను అభినందించారు. బేబీ సినిమాలోని ప్రతి విభాగం పై ప్రశంసలు కురిపించారు బన్నీ.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి బేబీ టీమ్ ను అభినందించారు. బేబీ సినిమా చూసిన చిరంజీవి.. దర్శక నిర్మాతలను ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు దర్శకుడు సాయి రాజేష్.  ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. “నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం ఇది నా దేవుడు నా సినిమా చూశారు” అంటూ ఎమోషనల్ అయ్యారు సాయి రాజేష్. అలాగే త్వరలోనే చిరంజీవితో బేబీ టీమ్ ఓ ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.