
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. రిలీజై సుమారు రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఈ మెగా మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 25) మన శంకరవరప్రసాద్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. కాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఫస్ట్ వీక్ లోనే రూ.292 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత మరో కలెక్షన్ పోస్టర్ రాలేదు. రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పారు కానీ.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది వెల్లడించలేదు. ఈ క్రమంలో 14 రోజుల కలెక్షన్స్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఇందులో సినిమా ప్రారంభం నుంచి థియేటర్లలో విడుదలై వరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం వరకూ జరిగిన మధుర జ్ఞాపకాలను చూపించారు
సుమారు 7 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రూపొందించిన ఈ వీడియోలో టైటిల్ అనౌన్స్ మెంట్స్, ఫస్ట్ లుక్, నయనతార ప్రమోషన్స్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, చిరంజీవి, వెంకటేష్ ల ప్రచారం.. ఇలా సినిమాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ ను పొందుపరిచారు. ఇక వీడియో చివర్లో ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డ్ క్రియేట్ చేసిందని పేర్కొంటూ రూ.350 కోట్ల కలెక్షన్ పోస్టర్ ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్ లో అదరగొట్టగా క్యాథరీన్ థెరీసా, అభినవ్ గోమఠం, జరీనా వాహబ్, సచిన్ ఖేడ్కర్, హర్షవర్దన్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. ఇక భీమ్స్ అందించిన పాటలు మెగాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.