
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అపజయమెరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ పవరేంటో మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రెండు రోజులకు కలిపి మెగా మూవీ మొత్తం రూ. 120 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, సంక్రాంతి పండగ సెలవులు రావడంతో రాబోయే రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు మూవీని నిర్మించారు. నయనతార కథానాయికగా నటించగా విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భీమ్స్ అందించిన స్వరాలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
#HappyBhogi2026 to everyone ❤️
SWAG KA BAAP is setting Box-office on fire across the globe 🔥🔥🔥
₹120Crores+ Gross worldwide in 2 DAYS for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥❤️🔥#MegaBlockbusterMSG
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/bIsz1HS9eu— Shine Screens (@Shine_Screens) January 14, 2026
కాగా ఓవర్సీస్ లోనూ మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఫస్ట్ డే నే 1.7 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియర్లలోనే వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిరు రెండో చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు కూడా భారీ వసూల్లు వచ్చినట్లు తెలుస్తోంది.
బుకింగ్స్ బద్దలైపోతున్నాయి 🔥🔥🔥
24.82K+ tickets sold in the last one hour on BMS for #ManaShankaraVaraPrasadGaru 💥💥💥
Massive surge in bookings every hour, with huge footfalls being registered across all areas ❤️🔥❤️🔥❤️🔥#MegaBlockbusterMSG All-night shows across the telugu… pic.twitter.com/NhJhuYRNxM
— Shine Screens (@Shine_Screens) January 13, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..