Ram Charan: మెగాపవర్ స్టార్- శంకర్ సినిమా టైటిల్ ఇదేనా.. జోరుగా సాగుతున్న ప్రచారం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan: మెగాపవర్ స్టార్- శంకర్ సినిమా టైటిల్ ఇదేనా.. జోరుగా సాగుతున్న ప్రచారం
Ram Charan

Updated on: Mar 10, 2022 | 9:00 AM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అలరించనున్నారు. ఇక చెర్రీలోని టెరిఫిక్ యాక్షన్ ఎలిమెంట్‌ని పోట్రే చేసిన పవర్‌ఫుల్ సినిమా వినయవిధేయరామ. మెగాపవర్‌స్టార్‌ని సోలో పెర్ఫార్మర్‌గా చూసి దాదాపు మూడేళ్లు దాటిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వెంటనే బిగ్‌ స్క్రీన్స్‌ని ఎటాక్ చెయ్యబోతున్న ఆచార్య కూడా మల్టిపుల్ స్టార్‌డమ్‌తో కూడుకున్నదే. నాన్న మెగాస్టార్‌తో దాదాపు ఈక్వల్‌గా స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు తనయుడు చరణ్‌.
మరి.. ఆచార్య తర్వాత  డైరెక్టర్ శంకర్. కియారా అద్వానీ హీరోయిన్‌గా, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ విలన్లుగా పెర్ఫామ్ చేస్తున్న ఈ సోషియో పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందట. ఇప్పటికే ఈ మూవీని హైదరాబాద్ పరిసరాల్లో.. రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. ఇంకా విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేయలేదు. అయితే ఈ మూవీలో చరణ్ రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది ఈ మూవీకి `సర్కారోడు` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు  టాక్ వినిపిస్తుంది.  దీనిపైపై క్లారిటీ రావాలంటే? ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Malavika Mohanan: చీరకట్టులో అందాల విస్ఫోటనం.. మాళవిక మోహనన్ మైండ్ బ్లోయింగ్ పిక్స్

Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..

Kriti Sanon: నాజూకైన ఒంపుసొంపులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్న కృతి సనన్