
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే నాలుగు అక్షరాలు కాదు నాలుగు దశాబ్దాల చరిత్ర. నవరసాలు అలవోకగా పండించే నటనా చాతుర్యం ఆయన సొతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మకుటం లేని మగమహారాజు చిరంజీవి. కోట్ల హృదయాలు కొల్లగొట్టిన కథానాయకుడు కోట్ల మంది అభిమానులకు ఆరాధ్య దైవం.. జీరో లెవెల్ నుంచి తన టాలెంట్ నే గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ లెవల్ కు ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగి కి కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీగా నిలిచిపోయిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ గా సినీ అభిమానుల హృదయాల్లో మానవత మూర్తిగా ప్రజలందరి మనసుల్లో చిరకాలం చిరంజీవిగా నిలిచిపోయే ఆదర్శ వ్యక్తి. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిరు పుట్టినరోజున వేడులను రెండు తెలుగు రాష్ట్రాలలోని కాదు దేశ విదేశాల్లో ఉన్న మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి పుట్టిన రోజు శుభాకాంక్షలను రాజకీయ, సినీ నటీనటులే కాదు.. యావత్ సినీ ప్రపంచం తెలిపింది. గత కొన్ని రోజులుగా మొదలైన పుట్టిన రోజు సందడి .. ఈరోజు వరకూ కూడా కొనసాగుతూనే ఉంది.
Chiru
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు గ్రీటింగ్ చెప్పడానికి నటీనటులే కాదు అభిమానులు కూడా అయన ఇంటికి వెళ్లారు.. కేక్ కటింగ్ చేయించి చిరుకి శుభాకాంక్షలు చెప్పారు.
Chiru
ఇక మరోవైపు పుట్టిన రోజు తో పాటు రాఖీపండగ కూడా చిరు ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు లతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలను చిరు ఇంట్లో నిర్వహించారు. మొత్తం మెగా అల్లు ఫ్యామిలీ కలిపి చిరు బర్త్ డే తో సందడి చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఫోటోలు సోషల్ మీడియా తెగ షేర్ అవుతున్నాయి.
Also Read: ఘనంగా జరుగుతున్న రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాలు.. ఆ రాయరు అనుగ్రహం కోసం పూజలు