Tollywood: అప్పుడు నెల జీతం రూ.100.. స్టార్ యాక్టర్‌గా మారిన పత్తి అమ్మిన కుర్రాడు.. ఎవరో తెల్సా

సినిమాల్లో అవకాశాలు దక్కడం అంత ఈజీ కాదు. అదృష్టం మాత్రమే కాదు.. సహనం, ఓర్పు లాంటివి కూడా ఉండాలి. ఒకప్పుడు చాలీచాలని జీతాలకు పని చేసిన వ్యక్తులే.. ఇప్పుడు స్టార్ యాక్టర్‌లుగా మారారు. ఈ నటుడు కూడా ఆ కోవకు చెందిన వారే.

Tollywood: అప్పుడు నెల జీతం రూ.100.. స్టార్ యాక్టర్‌గా మారిన పత్తి అమ్మిన కుర్రాడు.. ఎవరో తెల్సా
Tollywood

Updated on: Jan 18, 2025 | 12:37 PM

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అంత ఈజీ కాదు.. అదృష్టం ఒక్కటే సరిపోదు. దీనితో పాటు సహనం, ఓర్పు రెండూ ఉండాలి. స్టార్ యాక్టర్‌లుగా ఎదిగిన వారందరూ కూడా.. ఒకప్పుడు చాలీచాలని జీతాలకు పని చేసినవారే. ప్రస్తుతం ఆ కోవకు చెందిన కుర్రాడి గురించి ఇప్పుడు చూద్దాం. ఓటీటీలలో ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ దుమ్మురేపింది. కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ మూడు సీజన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌లోని ప్రతీ నటుడు తమ పాత్రల్లో జీవించారని చెప్పొచ్చు. ఇక వారిలో ఒకరు అశోక్ పాఠక్. ‘బినోద్’ పాత్ర పోషించి మంచి మార్కులు దక్కించుకున్నాడు.

ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇవి కూడా చదవండి

చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలని అశోక్ అనుకోలేదు. గ్రాడ్యుయేషన్‌ సమయంలో తాను నటన తప్ప మరేమీ చేయలేనని అనుకున్నాడు. ఈ విషయంపై అతడు మాట్లాడుతూ.. తొలుత పత్తి అమ్మేవాడినని.. తన తొలిసారి నెల జీతం రూ. 100 అని చెప్పుకొచ్చాడు. బీహార్‌లోని ఓ మారుమూల జిల్లాలో పుట్టి పెరిగిన అశోక్.. తన యవ్వనాన్ని హర్యానాలో గడిపాడు. తండ్రి అతడ్ని గ్రాడ్యుయేషన్ చదివించాలనుకున్నాడు. కానీ అశోక్‌కు చదువుపై ఆసక్తి లేదు. కేవలం 40 శాతం మార్కులతోనే 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత అతడు కష్టపడి కాలేజీలో అడ్మిషన్ పొందాడు. ఇక ఆ కాలేజీ జీవితమే అతడ్ని పూర్తిగా మార్చేసింది. థియేటర్ నటన గురించి తెలుసుకున్నాడు. స్టేజిపై పలు ప్రదర్శనలు ఇచ్చాడు. అలా తన కళాశాలలో నటనకు గానూ అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

మొదటి సినిమా ‘శూద్ర ది రైజింగ్’..

కాలేజీ యాజమాన్యం అశోక్‌లోని నటనా నైపుణ్యాన్ని చూసి.. ఫీజు కూడా మాఫీ చేసింది. ఆ తర్వాత లక్నోలోని యాక్టింగ్ అకాడమీలో చేరాడు అశోక్. అక్కడ మూడు సంవత్సరాలు నటనలో మెలుకువలు నేర్చుకుని, ‘శూద్ర ది రైజింగ్’ కోసం తన మొదటి ఆడిషన్ ఇచ్చాడు. అందులో ఎంపిక అయ్యి.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసను అందుకోవడమే కాదు.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ కూడా అందుకుంది.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

రూ.1లక్ష 40వేలు సంపాదన..

తన మొదటి సంపాదనను 9వ తరగతిలోనే సంపాదించని చెప్పాడు అశోక్ పాఠక్. ఆ సమయంలో తాను పత్తి అమ్మేవాడినని.. తద్వారా నెలకు రూ. 100 జీతం సంపాదించానని చెప్పాడు. అలాగే తను 2011లో ముంబైకి వచ్చానని, ఆ తర్వాత కేవలం 2-3 నెలలకే డొమినోస్ పిజ్జా నుంచి యాడ్ షూట్ కోసం ఆఫర్ వచ్చిందని, అందుకుగానూ తనకు రూ.1 లక్షా 40 వేలు వచ్చాయని చెప్పాడు.

ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి