Sundeep Kishan : పాటకు ప్రాణం పోసిన మజాకా టీం.. ఒరిజినల్ సింగర్‏తోనే పాడించేశారుగా.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే

ఈమధ్య కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ జానపదాలు ఎంతగా దూసుకుపోతున్నాయో చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్‏తో నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన తెలంగాణ ఫోక్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఇప్పుడు సినిమాలో రీక్రియేట్ చేసింది మజాకా టీం.

Sundeep Kishan : పాటకు ప్రాణం పోసిన మజాకా టీం.. ఒరిజినల్ సింగర్‏తోనే పాడించేశారుగా.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే
Mazaka Movie

Updated on: Feb 25, 2025 | 5:37 PM

సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మ.. చెమ్మగిల్లి ముధ్దుయ్యవే.. సాంగ్ యూట్యూబ్‏లో ఓ సంచలనం. రాము రాథోడ్ రాసిన ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆ పాటతోనే రాము రాథోడ్ మరింత పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సాంగ్ తర్వాత రాము రాథోడ్ రాసిన మరిన్ని పాటలు సైతం యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. అయితే నెట్టింట సెన్సేషన్ అయిన సొమ్మసిల్లి పోతున్నవే పాటను ఇప్పుడు హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న మాజాకా టీం రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న మజాకా టీంలో ఈ పాటను కాస్త మార్చి చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో ఒరిజినల్ సింగర్ కాకుండా రేవంత్ చేత ఈ పాటను పాడించారు.

సింగర్ రేవంత్ పాడిన ఈ పాటపై నెటిజన్స్ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. రేవంత్ పాడితే చాలా కృత్రిమంగా ఉందని.. పాటలోని అసలు ఫీల్ పోయిందని.. అసలు సాంగ్ రేవంత్ కు సెట్ కాలేదని కామెంట్స్ చేశారు. రేవంత్ గాత్రంతోపాటు మజాకా టీంపై అనేక కామెంట్స్ చేశారు. ఒరిజినల్ సింగర్ పాడితే బాగుండేదని.. రేవంత్ పాడితే ఆ పాటలోని ఫీల్ రావడం లేదని.. అతడి వాయిస్ సెట్ కాలేదంటూ వచ్చిన కామెంట్స్ మేకర్స్ వద్దకు చేరాయి. దీంతో సినిమా విడుదలకు ముందు ఊహించని నిర్ణయం తీసుకుంది మూవీ టీం.

ఇవి కూడా చదవండి

సింగర్ రేవంత్ పాడిన వెర్షన్ కాకుండా.. ఒరిజినల్ సింగర్ రాము రాథోడ్ చేత మరోసారి స్పెషల్ గా పాట పాడించారు. ఇప్పుడు రాము రాథోడ్ పాడిన పాట మాత్రమే థియేటర్లలో ఉంటుందని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని మేం గౌరవిస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లిడించారు మేకర్స్. “మీరు అడిగారు.. మేము చేశాము. న్యాయమైన సుధీర్ఘ పోరాటం తర్వా” అంటూ ఒరిజినల్ సింగర్ రాము రాథోడ్ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు సందీప్ కిషన్. మేకర్స్ నిర్ణయంపై నెటిజన్స్, శ్రోతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాట బాగుందని.. సాంగ్ ఫీల్ వస్తుందని.. రాము రాథోడ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు సాయంత్రం నుంచే మజాకా ప్రీమియర్లు పడనున్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..