Keeravani Son: ‘భాగ్‌ సాలే’ అంటోన్న కీరవాణి కుమారుడు.. పుట్టిన రోజు సందర్బంగా రెండు అప్‌డేట్‌లు ఇచ్చిన హీరో..

|

Feb 23, 2021 | 1:01 PM

Sri Simha Announce New Movie: 'మత్తు వదలరా' సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా నటనకు ప్రాధాన్యత కలిగిన చిన్న సినిమాలో నటించి తనకంటూ..

Keeravani Son: భాగ్‌ సాలే అంటోన్న కీరవాణి కుమారుడు.. పుట్టిన రోజు సందర్బంగా రెండు అప్‌డేట్‌లు ఇచ్చిన హీరో..
Follow us on

Sri Simha Announce New Movie: ‘మత్తు వదలరా’ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా నటనకు ప్రాధాన్యత కలిగిన చిన్న సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటి సినిమానే అయినా నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు.


ఇదిలా ఉంటే ఈ యంగ్‌ హీరో తాజాగా ‘తెల్లవారితే గురువారం’ అనే మరో వైవిధ్య భరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఈరోజు (మంగళవారం) శ్రీ సింహ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు.. ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో పెళ్లి డ్రస్‌లో సిగిరెట్‌ వెలిగిస్తూ కనిపించాడు. ఇక కళ్ల జోడు పగిలి కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.


ఇదిలా ఉంటే ఇదే రోజు శ్రీ సింహ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ‘భాగ్‌ సాలే’ అనే వినూత్న టైటిల్‌తో తెరకెక్కనున్న ఈసినిమా కాన్సెప్ట్‌ ఫొటోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పిస్తుండగా మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ మార్చి మూడో వారం నుంచి మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం.

Also Read: తెలుగులో సందడి చేయనున్న ‘సూపర్ డీలక్స్’.. డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసిన ఆ నిర్మాణ సంస్థ..