Pawan Kalyan : వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పటికే తను సైన్ చేసని సినిమాలను ఫాస్ట్ ఫార్వడ్‌లో కంప్లీట్ చేస్తూ… ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్తమీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ తో సినిమా చేస్తున్నాడు పవన్.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగు పూర్తయిన తరువాత ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. భీమ్లానాయక్ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. సినిమా కూడా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇప్పుడు క్రిష్ సినిమా పై దృష్టి పెట్టారు పవన్. అయ్యితే మార్చి ఫస్ట్ వీక్ లో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోందట. ఇందుకోసం హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లో కీలక ఘట్టాలని షూట్ చేసి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ రోషనారగా నటిస్తుండగా అర్జున్ రాంపల్, ఆదిత్యమీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :