మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. దేవా కట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. చాలా కాలం తర్వత ‘చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్‌లో ప్రతిరోజు పండగే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే సోబెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి మూవీ రాబోతుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది.ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో
నటిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్ – రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయని అంటున్నారు. అహంకారంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో మెలిగే అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిలింనగర్‌లో టాక్.
తాజాగా ఈ సినిమానుంచి మంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘జోర్ సే’ అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి – సాకీ శ్రీనివాస్ – బరిమిశెట్టి కలసి ఆలపించారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ పాటలో సాయి తేజ్ ఎనర్జిటిక్ స్టెప్స్ అలరిస్తున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..
Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..