Jahnavi Swaroop : అబ్బా.. ఏమన్నా అందమా.. యాడ్‏తో దుమ్మురేపిన మహేష్ బాబు మేనకోడలు.. వీడియో చూస్తే ఫిదా..

సినీరంగంలోకి త్వరలోనే ఘట్టమనేని వారసులు అడుగుపెట్టనున్నారు. కొన్నిరోజులుగా ఘట్టమనేని ఫ్యామిలీ వారసుల గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మహేష్ బాబు కొడుకు, కూతురితోపాటు సుధీర్ బాబు కొడుకులిద్దరూ సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే ఇప్పుడు మరో వారసురాలు వెండితెరపైకి తెరంగేట్రం చేయనుంది.

Jahnavi Swaroop : అబ్బా.. ఏమన్నా అందమా.. యాడ్‏తో దుమ్మురేపిన మహేష్ బాబు మేనకోడలు.. వీడియో చూస్తే ఫిదా..
Janhvi Swaroop

Updated on: Nov 08, 2025 | 12:47 PM

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. మహేష్ బాబు సోదరి నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తె.. లెజండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు జాన్వీ స్వరూప్ త్వరలోనే కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన కూతురి అందమైన ఫోటోస్ మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వీలైనంత త్వరగానే జాన్వీ హీరోయిన్ గా కనిపించనుందని టాక్ నడించింది. అయితే తన తొలి సినిమాను ప్రకటించకముందే జాన్వీ ఒక ప్రతిష్టాత్మ వాణిజ్య ప్రకటనలో కనిపించడం విశేషం. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ యాడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ జ్యువెల్లరీ కు జాన్వీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో సదరు సంస్థ కోసం ఆమె యాడ్ లో నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం.. ఇందులో మరింత అందంగా మైస్మరైజ్ చేసింది. ఈ యాడ్ లో ట్రెడిషనల్ లుక్ లో ఆశ్చర్యపరిచింది..ఇటీవల నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సైతం ఓ జ్యువెల్లరీ బ్రాండ్ సంస్థ కోసం యాడ్ చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ స్వరూప్ త్వరలోనే తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

ఇప్పటికే జాన్వీ నటన, డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు టాక్. అలాగే కథానాయికగా తెరంగేట్రం చేసేందుు ఒక స్టోరీని సైతం ఫైనల్ చేశారట. జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేని తెలుగు సినీప్రియులకు సుపరిచితమే. నటిగా, దర్శకురాలిగా సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ సైతం స్టార్ట్ చేసి తన పర్సనల్, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

Follow Us