Vicky Kaushal: హిస్టారికల్ రోల్స్‌కు కేరాఫ్‌గా మారిన విక్కీ
ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు విక్కీ కౌషల్. డిఫరెంట్ మూవీస్‌తో బాలీవుడ్‌లో సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రజెంట్ డిఫరెంట్ మూవీస్‌తో అలరిస్తున్నారు. ముఖ్యంగా హిస్టారికల్, మైథలాజికల్ కాన్సెప్ట్స్‌కు కేరాఫ్‌గా మారారు విక్కీ. యురి, సర్దార్ ఉద్దమ్, సామ్ బహద్దూర్ సినిమాలతో బెస్ట్ పర్ఫామర్‌గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌషల్.
అన్ సంగ్ హీరోస్ రోల్స్‌కు తాను బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకోవటంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది. ఆ ఇమేజ్‌ను అలాగే కాపాడుకుంటూ డిఫరెంట్ మూవీస్‌ను లైన్‌లో పెడుతున్నారు విక్కీ. ఛావా సినిమాతో మరోసారి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు విక్కీ. శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ హిస్టారికల్ క్యారెక్టర్‌ను ప్లే చేశారు. ఈ సినిమాలో విక్కీ ఫర్ఫామెన్స్ మాస్టర్ క్లాస్ అన్న పేరొచ్చింది. ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ అదే జోరు చూపించింది. ప్రజెంట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్న విక్కీ… ఆ తరువాత ఓ మైథలాజికల్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారు. పరశురాముడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహావతార్ మూవీలో లీడ్ రోల్‌లో నటించేందుకు ప్రిపేర్ అవుతున్నారు ఈ బాలీవుడ్ స్టార్. ఈ సినిమాలో షూటింగ్ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహావతార్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారు హీరో విక్కీ కౌషల్. దర్శకుడు అమర్ కౌశిక్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టిన దగ్గర నుంచే ఈ నియమం పెట్టుకున్నారు. ఇప్పుడు విక్కీ కూడా డైరెక్టర్‌ను ఫాలో అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ
Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

