Ponniyin selvan 2: మణిరత్నం సినిమాతో పోటీకి సై అంటున్న కుర్ర హీరో

అందమైన ప్రేమలో దాగిన విషయాలు, ఆ ప్రేమే ఈ కథకు విలన్‌ అయితే ఏర్పడే పరిస్థితులు గురించి చెప్పారు విక్రమ్‌. ఐశ్వర్యరాయ్‌ ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నారు.

Ponniyin selvan 2: మణిరత్నం సినిమాతో పోటీకి సై అంటున్న కుర్ర హీరో
Ps2, Agent
Follow us

|

Updated on: Mar 09, 2023 | 7:40 AM

ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు అనుకోండి. మాకేం ఫికర్‌ లేదు. మేం అనుకున్నది మేం చేస్తామని సైలెంట్‌గా సౌండ్‌ చేస్తున్నారు పీయస్‌2 మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన వీడియాలోనూ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు క్రియేటివ్‌ మాస్టర్‌ మణిరత్నం. ఇంతకీ మణి హింట్ ఇచ్చిన ఆ విషయం ఏంటంటున్నారా.? ఆ మధ్య చోళాస్‌ ఆర్‌ బ్యాక్‌ అని పీయస్‌ 2 బీటీయస్‌ వీడియో విడుదల చేశారు మణిరత్నం. పీయస్‌1లో ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ, ఆ షాట్స్ వాడుకుంటూ ఈ వీడియో క్రియేట్‌ చేశారు. జయం రవి, జయరామ్‌, కార్తి కూర్చుని మాట్లాడుకుంటున్న తీరు అట్రాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా గురించి జనాలకు ఏం చెప్పాలి.? ఏం చెప్పకూడదనే విషయాల మీద సరదాగా మాట్లాడుకున్నారు ఆ ముగ్గురూ

అందమైన ప్రేమలో దాగిన విషయాలు, ఆ ప్రేమే ఈ కథకు విలన్‌ అయితే ఏర్పడే పరిస్థితులు గురించి చెప్పారు విక్రమ్‌. ఐశ్వర్యరాయ్‌ ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 28న రావడం పక్కా అనే విషయాన్ని మరోసారి ఈ వీడియోలో చెప్పేశారు మేకర్స్. ఆదిత్య చోళుడిగా విక్రమ్‌ నటన, ఆయన మానసిక స్థితి, ఆయన ప్రేమలో పడ్డ తీరు, ప్రేయసి కోసం పరితపించిన విధానం ఇవన్నీ పొన్నియిన్‌ సెల్వన్‌ సబ్జెక్టులో హైలైట్‌ అంశాలు.సినిమా ఇండస్ట్రీలో నెవర్‌ సీన్‌ బిఫోర్‌ సన్నివేశాలన్నిటినీ తప్పకుండా పొన్నియిన్‌ సెల్వన్ 2లో చూస్తారని అన్నారు కార్తి. వందియదేవన్‌ వల్లవరాయన్‌గా సెకండ్‌ పార్ట్ లోనూ కీ రోల్‌ చేస్తున్నట్టు చెప్పారు కార్తి. గతేడాది విడుదలై 500 కోట్లు కొల్లగొట్టిన పీయస్‌1 కి సీక్వెల్‌గా వస్తున్న సెకండ్‌ చాప్టర్‌ మీద జనాల్లోనూ క్రేజ్‌ బాగా కనిపిస్తోంది.

ఏప్రిల్‌ 28కే ఫిక్స్ అని మణిరత్నం పీయస్‌2ని అనౌన్స్ చేయడంతో, మన దగ్గర సురేందర్‌ రెడ్డి కూడా మరింత జాగ్రత్తగా ప్రాజెక్ట్ ని డిజైన్‌ చేస్తున్నారు. అఖిల్‌ అక్కినేని హీరోగా, మమ్ముట్టి కీలక పాత్రలో సురేందర్‌ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఏజెంట్‌ సినిమా కూడా ఏప్రిల్‌ 28నే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి స్పందన వస్తోంది. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది ఏజెంట్‌. మరి పొన్నియన్ సెల్వన్ 2 కు పోటీగా వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..