Mani Ratnam Navarasa : నవరసాలను చూపించిన మణిరత్నం.. ఆకట్టుకుంటున్న టీజర్

సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. అయితే మణిరత్నం సినిమాలు మాత్రం అన్నివర్గాల ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి.

Mani Ratnam Navarasa : నవరసాలను చూపించిన మణిరత్నం.. ఆకట్టుకుంటున్న టీజర్
Navarasa

Updated on: Jul 09, 2021 | 7:19 PM

Mani Ratnam Navarasa : సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. అయితే మణిరత్నం సినిమాలు మాత్రం అన్నివర్గాల ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి మణిరత్నం సినిమాలు. ఇప్పుడు మణిరత్నం నిర్మాతగా మారి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘నవరస’. తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది మంది హీరోలతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించనున్నారు. దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌‌‌‌లో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క దర్శకుడు. హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం – ధైర్యం – అద్భుతం – బీభత్సం లాంటి మానవ జీవితంలోని నవరసాల ఎమోషన్స్ తో ‘నవరస’ ఆంథాలజీ సిరీస్ రూపొందింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో వచ్చే నెల ఆగస్ట్ 6వ తేదీన ”నవరస” ఆంథాలజీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రయునిట్. ఈ  టీజర్ లో నటీనటుల హావభావాలను చూపించారు. ఈ టీజర్ లో చూపించారు. సూర్య – విజయ్ సేతుపతి – బాబీ సింహా – ప్రకాష్ రాజ్ – అరవింద్ స్వామి – బొమ్మరిల్లు సిద్ధార్థ్ – నిత్యా మీనన్ – ఐశ్వర్య రాజేష్ – విక్రాంత్ – గౌతమ్ కార్తీక్ – శ్రీరామ్ – అశోక్ సెల్వన్ – రేవతి – ప్రయాగా మార్టిన్ – డిల్లీ గణేష్ – రోహిణి – యోగిబాబు – అదితి బాలన్ – శ్రీరామ్ – రిత్విక – అభినయశ్రీ – అధర్వ మురళి – అంజలి – గౌతమ్ మీనన్ తదితరులు ఈ సిరీస్ లో నటించారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ్ చదవండి :

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో న్యూ లుక్.. బాలీవుడ్ మూవీ కోసం ఆర్మీ జవాన్ గా మారిన నాగచైతన్య

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ను ఢీ కొట్టబోయేది అర్జున్‌ కాదటా.. మరెవరో తెలుసా.?

Mahasamudram : షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన మహాసముద్రం టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్