టాప్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam)సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎదో తెలియని ఆసక్తి నెలకొంటుంది. విభిన్న కథలను ఎంచుకొని తనదైన శాలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్నారు మణిరత్నం తాజాగా ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఇందులో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. వీళ్ళు కాకుండా విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాల, పార్తీబన్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మణిరత్నం.
తాజాగా ఈ సినిమానుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మణిరత్నం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది . రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్ అన్నారు. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణి గారికి థాంక్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.