Manchu Vishnu: ‘సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్’.. మంచు విష్ణు సంచలన కామెంట్స్

|

Feb 07, 2022 | 1:52 PM

Movie Artists Associaton: సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు.

Manchu Vishnu: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్.. మంచు విష్ణు సంచలన కామెంట్స్
Manchu Vishnu
Follow us on

Tollywood: టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు మంచు విష్ణు. ఇప్పటికే అన్ని చాంబర్స్‌తో మంతనాలు జరుగుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలతోనూ టికెట్‌ ధరల విషయంపై చర్చలు జరగాలన్నారు. అయితే చాంబర్స్‌ మధ్య విభేదాలే చర్చల్లో సాగదీతకు కారణమని విష్ణు మాటల్లో తెలుస్తోంది. సీఎం జగన్‌(CM Jagan)తో మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు. ఈ భేటీలపై వ్యక్తిగతంగా తన అభిప్రాయంతో పనిలేదన్నారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. గతంలో వచ్చిన జీవోలు తీసేసిన జీవోలపై ముందు మాట్లాడాలని.. ఆతర్వాతే ప్రస్తుత జీవోలపై మాట్లాడాలన్నారు మంచు విష్ణు. మా’ అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడతానన్నారు.  చివరగా తనను విమర్శిస్తున్నారంటే తాను పాపులర్ అని అర్థం అంటూ పంచ్ పేల్చారు విష్ణు.

మర్యాదపూర్వకంగా చిరు-జగన్ మీటింగ్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో   చిరంజీవి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఇటీవల భేటీ అయ్యారు. చిరంజీవి,  జగన్ మధ్య మర్యాదపూర్వక లంచ్‌ భేటీ జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు. తాను ఇండస్ట్రీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చానని చిరంజీవి అప్పుడు పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌ ఆహ్వానం మేరకు తాను తాడేపల్లికి వచ్చినట్లు మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. కాగా ఈ మీటింగ్ అనంతరం వైసీపీ చిరుకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించారు మెగాస్టార్. రాజకీయాలకు తాను పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లు స్పష్టం చేశారు. ఆ వార్తలు స్పెక్యులేషన్ అని కొట్టిపారేశారు.

Also Read: ‘అలా ఉంటే మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి’.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్

గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..