
మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. . కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అత్యధిక బడ్జె్ట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు మంచు విష్ణు.
ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ప్రభాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర చేస్తున్నారు. తాజాగా విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.
మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకూ మంచు విష్ణు ఏమన్నారంటే.. మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టరే.. అతను లెజెండ్ కాదు.. ప్రభాస్ లెజెండ్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది. మోహన్ లాల్ ఓ లెజెండ్.. ఎందుకంటే కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది. ప్రభాస్ త్వరలోనే లెజెండ్ అవుతాడని ఆశిస్తున్నా అని మంచు విష్ణు అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కన్నప్ప సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Prabhas is a normal actor for me#Mohanlal is a Legend
– Manchu Vishnu https://t.co/ttMz9lmK5F pic.twitter.com/mn2kPt1zob— Nag Mama Rocks (@SravanPk4) April 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి