
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇంతలో, ‘ కన్నప్ప ‘ సినిమా నిడివి ఎంత అనేది వెల్లడైంది. ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 10 నిమిషాలని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడు. మూడు గంటలకు పైగా నిడివి గల ఈ చిత్రంలో ప్రభాస్ సుమారు 30 నిమిషాలు కనిపిస్తారు. విష్ణు, మోహన్ బాబులతో అతని కాంబినేషన్ సీన్స్ ఉంటాయట.
ఇక కన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండనుందట. అయితే ఈ రోల్ సినిమాలో చాలా కీలకం కానుందట. వీరితో పాటు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరూ 10 నిమిషాలు స్క్రీన్‌పై కనిపించనున్నారని టాక్.
Wishing a legendary icon, Padma Bhushan Shri Mohanlal Garu, a very Happy Birthday! 🎉 His portrayal of Kirata in the epic saga #Kannappa🏹 promises to be a powerful blend of divine strength and cinematic brilliance.
From generations of unforgettable performances to stepping into… pic.twitter.com/pdoMf34ckd
— Kannappa The Movie (@kannappamovie) May 21, 2025
‘కన్నప్ప’ చిత్రంలోని తదుపరి పాట మే 28న కాల శ్రీకాళహస్తిలో విడుదల కానుంది. ఈ పాటను విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసి సంగీతం సమకూర్చారు. ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు మహాదేవ శాస్త్రి అనే పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతోంది.
Witness the magic unfold behind the scenes from #Kannappa🏹 Making Video. 🎬 Every frame, every effort — sculpting a legend!
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#kannappamakingvideo #OmNamahShivaya@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/faZ1UC48Te— Kannappa The Movie (@kannappamovie) May 8, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .