Mohan Babu: ఉగ్రదాడిలో మరణించిన ప్రవీణ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచిన మంచు ఫ్యామిలీ..

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే ఎంతోమంది ఆపన్నలను ఆర్ధికంగా ఆదుకున్నారు. తన విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కల్పించి చిన్నారుల..

Mohan Babu: ఉగ్రదాడిలో మరణించిన ప్రవీణ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచిన మంచు ఫ్యామిలీ..
Mohan Babu

Edited By: Surya Kala

Updated on: Jul 11, 2021 | 6:06 PM

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే ఎంతోమంది ఆపన్నలను ఆర్ధికంగా ఆదుకున్నారు. తన విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కల్పించి చిన్నారుల బంగారు భవిష్యత్ కు భరోసా ఇస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా భారత సైన్యంలో అవల్దార్‌గా పని చేస్తూ వీరమరణం పొందిన సి.హెచ్‌ ప్రవీణ్‌కుమార్‌ కుటుంబాన్నీ ఆదుకోవడానికి మోహన్ బాబు ముందుకొచ్చారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన ప్రవీణ్ గత ఏడాది నవంబర్‌లో శ్రీనగర్‌ 18వ రెజిమెంట్‌లో విధులను నిర్వహిస్తున్నసమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ప్రవీణ్ అమరుడయ్యాడు. ప్రవీణ్ కు భార్య రజిత, కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ప్రవీణ్ మరణంతో ఈ కుటుంబానికి సానుభూతిని తెలిపినవారే కానీ.. ప్రభుత్వం మినహా సహాయం చేసినవారు ఎవరూ లేరు..అయితే ప్రవీణ్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి విషయంపై 18వ రెజిమెంట్‌ అధికారి కల్నల్‌ ఓఎల్‌వి నరేష్‌, కమాండింగ్‌ ఆఫీసర్‌ మోహన్ బాబుకు స్వయంగా లేఖ రాశారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరారు. దీంతో మోహన్ బాబు స్పందించారు.

ప్రవీణ్‌ కుమార్‌ కుమార్తె లోహిత ప్రస్తుతం 4వ తరగతిలోకి వచ్చింది. దీంతో లోహితకు ఈ విద్యా ఏడాది 4వ తరగతి నుండి ఉచిత విద్య అందిస్తామని మంచు ఫ్యామిలీ హామీ ఇచ్చారు. దీంతో ప్రవీణ్‌ భార్య రజిత మోహన్ బాబు ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.

రంజిత కృతఙ్ఞతలు చెప్పడంపై మంచు విష్ణు స్పందిస్తూ.. తమకు కృతఙ్ఞతలు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. దేశ సరిహద్దుల్లో శత్రువుల నుంచి మన దేశాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతుండడంతో.. మనం ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నామని విష్ణు అన్నారు. అంతేకాదు.. ప్రతి జవానుకు అండగా ప్రతి భారతీయుడు ఉండాల్సిన భాద్యత ఉండాలని తెలిపారు.

Also Read:  భాగ్యనగరాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..మూడురోజులుగా 65 డెంగీ అనుమానిత కేసులు