మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ ముదిరింది. తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేశారు. మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. జలపల్లి లోని మంచు టౌన్ దగ్గర మంచు మనోజ్ హంగామా చేశారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశారు. టీవీ 9 మైక్ లాక్కొని మీడియా పై దాడి చేశారు మోహన్ బాబు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. కోపాన్ని ఆపుకోలేక మీడియా ప్రతినిధుల పై దారుణంగా దాడి చేశారు.
నా కూతురు లోపల ఉంది గేట్ తెరవండి అంటూ మంచు మనోజ్ అభ్యర్ధించారు. చాలాసేపటి నుంచి ఉన్నప్పటికీ మంచు మనోజ్ ను లోపలి రానివ్వకుండా.. గేటు తెరవకుండా.. సెక్యూరిటీ గార్డ్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఈక్రమంలో మోహన్ బాబు అక్కడకు రాగా టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణా రహితంగా మీడియా పై దాడి చేశారు.
టీవీ9 మైక్ లాక్కొని ప్రతినిధి పై దాడి చేయడంతో పాటు బూతులు తిడుతూ రెచ్చిపోయారు మోహన్ బాబు. మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని పోలీసు ఉననతాధికారుల అదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని పోలీసు ఉననతాధికారుల అదేశాలు జారీ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.