
ప్రస్తుతం అటు పర్సనల్ లైఫ్ పరంగానూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో గతేడాది భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మిరాయ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు మంచు వారబ్బాయి. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో, పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ఉక్రెయిన్ హీరోయిన్ మరియా ర్యాబోషప్కా నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు మనోజ్. సామాజిక అంశాలపై తన దైన శైలిలో స్పందిస్తున్నాడు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ ట్విట్టర్ (ఎక్స్) లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు మనోజ్.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 ఏళ్లలోపు పిల్లలకు, కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దీనిపై తాజాగా హీరో మంచు మనోజ్ స్పందిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
’13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించేలా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా ప్రశంసనీయం. యువత ఆలోచనా దృక్పథాన్ని రక్షించే దిశగా సరైన సమయంలో తీసుకున్న ఆలోచనాత్మకమైన నిర్ణయాలుగా నేను భావిస్తున్నాను. ఒక తండ్రిగా, అలాగే పిల్లలకు సంబంధించిన రంగంలో పని చేసే వ్యక్తిగా.. నేటి తరం పిల్లల్లో దూకుడు స్వభావం, తప్పుడు సమాచారం, వ్యసనపరులుగా మారే ప్రవర్తనలు ఎలా నెమ్మదిగా అలవాటుగా మారిపోతున్నాయో నేను స్వయంగా గమనిస్తున్నాను. పిల్లలు ఎదుగుతున్న కీలకమైన దశలో వారిని సంరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి రక్షణ చర్యలతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను” అని మంచు మనోజ్ ఎక్స్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Commendable initiative by N. Chandrababu Naidu garu for initiating a roadmap in Andhra Pradesh to regulate social media access for children below 13, and by the Government of Karnataka under Siddaramaiah garu for proposing restrictions for children under 16.
A thoughtful and… pic.twitter.com/fBp08tV3R7
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.