పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. దేశవ్యాప్తంగా ఈ మూవీపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశ్యంతో కొంతమంది సినీ ప్రముఖులు నిరుపేదలకు.. అనాథలకు ఉచితంగా ఈ మూవీ చూపించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఈ సినిమా టికెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10 వేల టికెట్లు పేదల కోసం తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ సైతం పదివేల టికెట్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టికెట్లు అందజేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు సైతం ఆదిపురుష్ సినిమాను వారికి ఫ్రీగా చూపిస్తానని అనౌన్స్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 పిల్లలకు ఈ సినిమాను ఉచితంగా చూపించేందుకు మనోజ్, మౌనిక దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రెండు ప్రైవేటు సంస్థలతో వీరు చేతులు కలిపారు. ఈ మేరకు మంచు మనోజ్ సోమవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. “ఎలాంటి హద్దులు లేకుండా ప్రతి ఒక్కరు వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావిస్తూ..జూన్ 16న విడుదలకాబోతున్న ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు ఈ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమం కోసం బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్ సంస్థలతో మేము చేతులు కలుపుతున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి.. మంచు మనోజ్, భూమా మౌనిక” అంటూ ప్రకటన విడుదల చేశారు.
ఇక మనోజ్ నిర్ణయానికి ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. కృతి సనన్ సీతగా కనిపించనుండగా.. రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. జూన్ 16న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
Jai Shri Ram ???#Adipurush ❤️?@BhumaMounika@Brihaspathitec @namastheworld#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @AAFilmsIndia @peoplemediafcy pic.twitter.com/WM1yolK0C2
— Manoj Manchu??❤️ (@HeroManoj1) June 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.