Manchu Lakshmi: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి

Manchu Lakshmi: 'మా' అధ్యక్షడిగా పదవీ స్వీకారం చేసిన మంచు విష్ణు, అక్క మంచు లక్ష్మి తన ప్యానల్ సభ్యులు తో కలిసి శ్రీవారిని..

Manchu Lakshmi: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి
Manchu Vishnu

Updated on: Oct 18, 2021 | 6:50 AM

Manchu Lakshmi: ‘మా’ అధ్యక్షడిగా పదవీ స్వీకారం చేసిన మంచు విష్ణు, అక్క మంచు లక్ష్మి తన ప్యానల్ సభ్యులు తో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నారు.  ఈరోజు ‘మా’ నూతన కార్యవర్గం శ్రీవారిని దర్శంచుకోనున్నారు. తాము అనుకున్న పనులుచేయడానికి తగిన బలం ఇవ్వమని స్వామివారిని కోరుకుంటామని చెప్పారు. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘మా’ బాగుందని.. దీనిని నెక్స్ట్ జనరేషన్ లెవెల్ కి తీసుకుని వెళ్తానని చెప్పారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు నూతన భవన నిర్మాణంపై మూడు నెలల్లో స్పష్టత ఇస్తానన్నారు.

తన తమ్ముడు విష్ణు గెలుపు పై మంచు లక్ష్మి స్పందిస్తూ.. విష్ణు మా అధ్యక్షుడిగా గెలవాలని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారని చెప్పారు. విష్ణు గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఇప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం మేము అందరం వచ్చామన్నారు మంచు లక్ష్మి. అంతేకాదు… దత్తన్న నిర్వహించిన అలయ్, బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా ఉండలేదు.. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని మంచు లక్ష్మి చెప్పారు. పవన్ కళ్యణ్, విష్ణు ఉన్న ఒక ఫోటో తీసి.. సోషల్ మీడియాలో ఏవేవో కథలు అల్లేస్తున్నారంటూ మండి పడ్డారు.. మాలో మాకు విబేధాలు లేవు.. మేమంతా ఒకటే అంటూ మంచి లక్ష్మి చెప్పారు.

Also Read:  పట్టపగలే డ్యూటీలో ఉండగా మందు తాగుతున్న పోలీస్.. రూల్స్ వీళ్ళకి వర్తించవా అంటున్న జనం