
మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. నటిగా, విలన్ గా, నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా ఇండస్ట్రీలో మల్టా ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యన సినిమాలు తగ్గించేసిన ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు తన వంతు కృషి చేస్తోంది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుంది మంచు వారమ్మాయి. ‘దక్ష: ఏ డెడ్లీ కాన్స్పిరసీ’ అనే చిత్రంలో మంచు లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తోంది. మోహన్ బాబు కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటొంది మంచు లక్ష్మి. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్ సెన్స్ పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై మంచు లక్ష్మి తీవ్రంగా మండి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ తో ‘ముంబైకి వెళ్ళిన తర్వాత లక్ష్మీ డ్రెస్సింగ్ ఏదోలా మారిపోయింది. 50 ఏళ్లకు చేరువవుతున్న ఓ మహిళ, 12 ఏళ్ల కూతురు ఉంది.. ఇలాంటి డ్రెస్సులు వేస్తుందని అనుకుంటారు కదా‘ అడిగాడు. దీనికి మంచు వారమ్మాయి స్పందిస్తూ.. ‘నేను హైదరాబాద్‌కి తిరిగి రావడానికి ముందు అమెరికాలో కూడా ఉన్నాను. నాకు నచ్చినట్లు డ్రెస్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఒక మగవాడిని ఇదే ప్రశ్న అడుగుతారా? మీకు అంత ధైర్యం ఉందా? మహేష్ బాబును కూడా ‘మీకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి, ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నారు?’ అని అడుగుతారా? మరి ఒక మహిళను ఇదే విషయం ఎలా అడుగుతారు? మీరు ఈ రోజు నన్ను అడిగిన దాని నుంచి విని ఆడియెన్స్ నేర్చుకుంటారు. ఒక జర్నలిస్టుగా మీరు మరింత బాధ్యతగా ఉండండి‘ అని క్లాస్ పీకింది మంచు వారమ్మాయి.
Unleashing the trailer of power, mystery, and fire: #Daksha – The Deadly Conspiracy.@themohanbabu @LakshmiManchu @thondankani @mynameisviswant @ChitraShuklaOff @vrenthambidorai @gemini4suresh @itsMVKrishna #AchuRajamani @madhureddi3 @bhimajiyanideephttps://t.co/YqRY0GD8qU pic.twitter.com/Fw4sn5FFhx
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 7, 2025
ప్రస్తుతం మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.