Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. గవర్నమెంట్‌ స్కూల్‌ చిన్నారులతో దీపావళి సంబరాలు.. అందరికీ బహుమతులు

టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన మంచు వారమ్మాయి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఆమె విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అలాగే వసతి ఇతర సదుపాయాలను సమకూరుస్తోంది.

Manchu Lakshmi: మంచు లక్ష్మి మంచి మనసు.. గవర్నమెంట్‌ స్కూల్‌ చిన్నారులతో దీపావళి సంబరాలు.. అందరికీ బహుమతులు
Manchu Lakshmi

Updated on: Nov 10, 2023 | 5:59 PM

దేశమంతా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సెలబ్రిటీలు, సామాన్యులనే తారతమ్యం లేకుండా అందరూ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాఇయ. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మీ తన మంచి మనసు చాటుకుంది. తాను దత్తత తీసుకున్న ప్రభుత్వం పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా దీపావళి సంబరాలు జరుపుకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన మంచు వారమ్మాయి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఆమె విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అలాగే వసతి ఇతర సదుపాయాలను సమకూరుస్తోంది. అలా తాను దత్తత తీసుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసిన మంచు లక్ష్మి వారితో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకొంది. గురువారం రాత్రి ఆమె నివాసంలోనే ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయి. దీపావళి సెలబ్రేషన్స్‌ కోసం తన ఇంటిని అందంగా ముస్తాబు చేసింది మంచు వారమ్మాయి. అలాగే చిన్నారులతో కలిసి టపాసులు సైతం కాల్చింది. అందరితో కలిసి డాన్సులు చేసింది.

మంచు వారమ్మాయి నిర్వహించిన దీపావళి సెలబ్రేషన్స్‌లో టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. చిన్నారులకు లాగే చిన్నారులకు డ్యాన్సుల పోటీలు, రోల్‌ ప్లేతో సహా పలు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే చిన్నారుల కోసం రుచికరమైన వంటకాలను అందుబాటులో ఉంచారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. ‘నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మా టీచ్ ఫర్ ఛేంజ్ పిల్లల కోసం నేను సమయం కేటాయిస్తూనే ఉంటాను. వారి అమాయకత్వం, స్వచ్ఛమైన ప్రేమ నాకు మరింత కష్టపడటానికి అవసరమైన శక్తిని అందిస్తుంది’ అని మంచు లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంచు వారమ్మాయి మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురుతో మంచు వారమ్మాయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.