Mamta Mohandas: మమతా మోహన్ దాస్ ఆ సినిమాలో కనిపించక పోవడానికి నయనతారే కారణమా..?

|

Mar 11, 2023 | 7:40 AM

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పై మమతా మోహన్ దాస్ పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేసింది.

Mamta Mohandas: మమతా మోహన్ దాస్ ఆ సినిమాలో కనిపించక పోవడానికి నయనతారే కారణమా..?
Nayanthara, Mamatha Mohan D
Follow us on

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంతో దైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ను జయించింది మమతా.. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పై మమతా మోహన్ దాస్ పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన ఓ సినిమా తనకు ఛాన్స్ దక్కిందని తెలిపారు మమతా మోహన్ దాస్. ఆ సినిమాలోని ఒక పాట కోసం షూటింగ్ కూడా చేశారట. దాదాపు నాలుగు రోజుల పాటు తన పై సాంగ్ ను షూట్ చేశారట. అయితే  షూట్ చేస్తున్న సమయంలో ఆ ఫ్రెమ్ లో నేను లేను అని అర్ధమైంది. కేవలం ఒకే ఒక్క షాట్ లో వెనకనుంచి కనిపించా అని అన్నారు.

నాకు చెప్పిన విధంగా సాంగ్ షూట్ జరగలేదని  ఆమె అన్నారు. ఎవరైతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారో ఆమె వల్ల ఈ విధంగా జరిగిందని మమత తెలిపారు. వేరే హీరోయిన్ షూటింగ్ లో ఉంటే నేను రాను అని హీరోయిన్ చెప్పడం తో ఇలా జరిగిందని అన్నారు. అయితే మమతా చెప్పిన రజినీకాంత్ సినిమా కథానాయకుడు. ఆ సినిమా హీరోయిన్ గా చేసింది నయనతార కావడం విశేషం. మమతా ఇలా హీరోయిన్ పేరు చెప్పకుండా నయన్ పై కామెంట్స్ చేసింది.