AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dear Krishna: ప్రేమలు బ్యూటీ మరో సినిమా.. టికెట్ బుక్ చేసుకుంటే 10,000 క్యాష్ ప్రైజ్.. వివరాలివే

ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది మలయాళ బ్యూటీ మమిత బైజు. ఇందులో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇప్పుడీ అందాల తార నుంచి మరో క్రేజీ మూవీ వస్తోంది. అదే డియర్ కృష్ణ.

Dear Krishna: ప్రేమలు బ్యూటీ మరో సినిమా.. టికెట్ బుక్ చేసుకుంటే 10,000 క్యాష్ ప్రైజ్.. వివరాలివే
Dear Krishna Movie
Basha Shek
|

Updated on: Jan 16, 2025 | 10:17 AM

Share

ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించిన తాజా చిత్రం డియర్ కృష్ణ. ఎన్ బలరామ్ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఐశ్వర్య మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మేకర్స్. స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ డియర్ కృష్ణ ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలి’ అంటూ విషెస్ చెప్పారు. కాగా ఇదే ఈవెంట్ లో చిత్ర బృందం ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సినిమా టికెట్ బుక్ చేసుకున్న వారికి అక్షరాల పదివేలు గెలుచుకునే సదావకాశాన్ని కల్పించింది. మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద నగదు బహుమతిగా అందించనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పుకొచ్చారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

కాగా శ్రీకృష్ణుడికి.. ఆయన భక్తుడికి మధ్య జరిగిన ఓ అద్భుత సంఘటనను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందంటున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా మెచ్చుకున్నారన్నారు. కాగా డియర్ కృష్ణ సినిమాకు హరి ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 24న విడుదల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి