Mammootty : సినిమా తారలను వదలనంటున్న మహమ్మారి.. మమ్ముట్టికి కరోనా పాజిటివ్

|

Jan 16, 2022 | 5:11 PM

కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణిపోతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు

Mammootty : సినిమా తారలను వదలనంటున్న మహమ్మారి.. మమ్ముట్టికి కరోనా పాజిటివ్
Mammootty
Follow us on

Mammootty : కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. కరోనా దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణిపోతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెడుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా తారలు షూటింగ్ లకు కూడా ప్యాకప్ చెప్పేసి ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే సినిమా తారలు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినిమా తారలు వరుసగా కరోనా బారిన  పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, త్రిష,  నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. అయితే వీరిలో మహేష్, మంచు లక్ష్మీ,  త్రిష కరోనా నుంచి బయట పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరోకు కరోనా పాజిటివ్  గా నిర్ధారణ అయ్యింది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని తన అభిమానులకు తెలియజేశారు . “అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొంచం జ్వరంతో ఉన్నాను.  నేను బాగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి” అని ట్వీట్ చేశారు. మమ్ముట్టి  కరోనా బారిన పడ్డారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ‘గెట్ వెల్ సూన్ సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu family photos: సతి సమేతంగా సంక్రాంతి సంబరాల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు .. (ఫొటోస్)

Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..