Kantara: Chapter 1: కాంతార ప్రీక్వెల్‌లో స్టార్ హీరో.. రిషబ్ శెట్టికి తండ్రిగా సీనియర్ నటుడు

|

Oct 01, 2024 | 8:02 PM

కాంతారకు ప్రీక్వెల్ గా  'కాంతార చాప్టర్ 1' సినిమా రానుంది. రిషబ్ శెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా కథ మొత్తం కదంబ యుగంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కాంతార సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆతర్వాత ఇతర భాషల్లో విడుదలైంది.

Kantara: Chapter 1: కాంతార ప్రీక్వెల్‌లో స్టార్ హీరో.. రిషబ్ శెట్టికి తండ్రిగా సీనియర్ నటుడు
Kantara 1
Follow us on

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ కాంతార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా  ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రానుంది. రిషబ్ శెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా కథ మొత్తం కదంబ యుగంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కాంతార సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆతర్వాత ఇతర భాషల్లో విడుదలైంది. కాగా ఇప్పుడు కాంతార చాప్టర్ 1ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కాంతార: చాప్టర్ 1లో నటించనున్నారని తెలుస్తోంది. రిషబ్‌కి తండ్రి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘కాంతార: చాప్టర్ 1’ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారాని సమాచారం. రిషబ్ ఏప్రిల్‌లో మోహన్‌లాల్‌ను కలిశాడు. కాగా ఇప్పుడు కాంతార టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

‘కాంతార సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కుందాపూర్‌లో జరుగుతోంది. 2025లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా విడుదల తేదీపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇక మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బరోజ్’. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.