Lokesh Kangaraj: హీరోగా లోకేష్ కనగరాజ్.. ఛాన్స్ కొట్టేసిన మలయాళీ హీరోయిన్.. ఇంతకీ ఎవరంటే..

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఇప్పటికే లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న లోకేష్.. ఇటీవలే కూలీ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.

Lokesh Kangaraj: హీరోగా లోకేష్ కనగరాజ్.. ఛాన్స్ కొట్టేసిన మలయాళీ హీరోయిన్.. ఇంతకీ ఎవరంటే..
Lokesh Kanagaraj

Edited By:

Updated on: Sep 01, 2025 | 7:05 PM

దక్షిణాది సినిమా ప్రపంచంలోని టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మా నగరం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. ఆ తర్వాత ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో కలెక్షన్స్ సునామి సృష్టించారు. ఇటీవలే కూలీ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక త్వరలోనే ఖైదీ సీక్వెల్ రూపొందించనున్నారు. దళపతి విజయ్, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. ఇన్నాళ్లు దర్శకుడిగా అదరగొట్టిన లోకేష్.. ఇప్పుడు హీరోగా మారనున్నారు. దీంతో హీరోగా ఆయన తొలి ప్రాజెక్ట్ పై మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో లోకేష్ సరసన మలయాళీ చిన్నది మిర్నా మీనన్ కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

మిర్నా మీనన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఆది సాయి కుమార్ క్రేజీ ఫెల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఉగ్రం సినిమాలో కనిపించింది. కానీ ఈ రెండు సినిమాలతో మిర్నాకు అంతగా గుర్తింపు రాలేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. తాజాగా లోకేష్ కనగరాజ్ సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..