
మలయాళి నటి లీనా రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ గగన్యాన్ వ్యోమగామిని జనవరిలో వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లైన 40 రోజుల తర్వాత తమ వివాహం గురించి అధికారికంగా అనౌన్స్ చేశారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న లీనా.. కొన్నాళ్లుగా ఒంటరిగానే ఉంది. ఈ ఏడాది జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్యాన్ ప్రాజెక్టులో నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. అందులో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ మొదటి వ్యక్తి. ప్రధానీ మోదీ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన వెంటనే లీనా తన పెళ్లి గురించి బయటపెట్టింది. దీంతో వీరికి సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
“ఇండియన్ మొదటి వ్యోమగామిగా ప్రశాంత్ బాలకృష్ణన్ పేరును మోదీజీ ప్రకటించారు. ఇది మన దేశానికీ.. కేరళ రాష్ట్రానికి ఒక హిస్టారిక్ మూమెంట్..ముఖ్యంగా నాకు ఇది ఎంతో సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక రహస్యం తెలియజేయడం కోసం నేను ఎంతగానో ఎదురుచూసాను. జనవరి 17న 2024న నేను ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వివాహం చేసుకున్నాను. అది ఇప్పుడు అధికారికంగా మీకు తెలియజేస్తున్నాను” అంటూ ఇన్ స్టాలో షేర్ చేసుకుంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోస్ పంచుకుంది.
తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళి నటి లీనా. డైరెక్టర్ మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ లో ఆమె మేరీ జోసెఫ్ పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తరెకెక్కిస్తున్న ఆడు జీవితం చిత్రంలో నటిస్తుంది. అలాగే మలయాళంలో మరిన్ని సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.