సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి.. రాక్షసుడు సీక్వెల్ కోసం రంగంలోకి మక్కల్ సెల్వన్..?

| Edited By: Anil kumar poka

Jul 15, 2021 | 9:08 AM

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమా తెలుగులో రాక్షసుడు గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి.. రాక్షసుడు సీక్వెల్ కోసం రంగంలోకి మక్కల్ సెల్వన్..?
Sethupathi
Follow us on

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రచ్చసన్ సినిమా తెలుగులో రాక్షసుడుగా రీమేక్ అయిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఊపిరి పీల్చుకోవని సస్పెన్స్‌తో కూడిన కథ, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్‌మెంట్‌తో సాగే కథనం సినీ లవర్స్‌ను ఫిదా చేసింది. 2019లో తెలుగులో విడుదలైన ఈ సినిమాలో బెల్లం కొండ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్‌. రాక్షసుడు-2″నుఇటీవల పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. “రాక్షసుడు-2″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అయితే సినిమాలో నటించబోయే హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

అయితే ఈ సినిమాలో నటించే హీరో ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ లో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల దర్శకుడు రమేశ్ వర్మ చెన్నై వెళ్లి, విజయ్ సేతుపతికి ఈ చిత్రకథ వినిపించాడని, అది ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ఈ చిత్రం తప్పకుండా చేస్తానని విజయ్ హామీ ఇచ్చాడట. ఇదిలా ఉంటే అటు హీరోగా ఇటు విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. మంచి కథ దొరికితే డైరెక్ట్ గా హీరోగా తెలుగులో సినిమా చేయాలనీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం రాక్షసుడు 2 ద్వారా అందిందని అంటున్నారు. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..