దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్. ఈ మూవీలో డార్లింగ్ లుక్స్.. యాక్టింగ్‌కు ప్రపంచమే ఫిదా అయ్యింది. ముఖ్యంగా రాజసంలో ప్రభాస్ లుక్స్ ఇప్పటికీ అభిమానుల మనసులో నిలిచిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి తర్వాత డార్లింగ్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ప్రభాస్‌తో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ రూపొందించేందుకు సౌత్ టూ నార్త్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా భారీ బడ్జె్ట్.. పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అయితే బాహుబలి సినిమాతో సెన్సెషనష్ క్రియేట్ చేసిన డార్లింగ్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక వారి ఆశలన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సలార్ సినిమాపైనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ స్మైలీ లుక్ విడుదల చేశారు మేకర్స్. అందులో డార్లింగ్ చిరునవ్వు చిందిస్తూ మరింత అందంగా కనిపిస్తున్నారు. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కూల్ పిక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి మరికొన్ని ఆన్ సీన్ పిక్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. పీరియాడికల్ డ్రామాలోని పచ్చ బొట్టేసిన పాటలోని స్టిల్ అని తెలుస్తోంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీని కంప్లీట్ చేశారు డార్లింగ్. ఇందులో మొదటిసారి రాముడి పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రా నుంది. అలాగే.. కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ కె.. మారుతి దర్శకత్వంలో రాజా డిలక్స్ చిత్రాలు చేస్తున్నారు.
— Baahubali (@BaahubaliMovie) November 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.