Leo Movie : దళపతి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే

విజయ్ సినిమా 'లియో' విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దళపతి విజయ్ ఎలా ఉండబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. దీన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ బాడ్ న్యూస్ ను అధికారికంగా ప్రకటించింది.

Leo Movie : దళపతి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే
Leo

Updated on: Sep 27, 2023 | 11:50 AM

దళపతి విజయ్ నటిస్తున్న నయా మూవీ లియో. విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విజయ్ సినిమా ‘లియో’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దళపతి విజయ్ ఎలా ఉండబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. దీన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ బాడ్ న్యూస్ ను అధికారికంగా ప్రకటించింది.

దళపతి విజయ్ సినిమాల్లో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో పాటలు అందరినీ ఆకర్షిస్తాయి. అందుకే భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. అయితే ‘లియో’ సినిమా ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ చేయకూడదని టీమ్ నిర్ణయించుకుంది. దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరిన్ని పాస్‌ల డిమాండ్ అలాగే భద్రతా పరిమితుల కారణంగా లియో ఆడియోను లాంచ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము. సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందిస్తూ మీతో టచ్‌లో ఉంటాం’ అని సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్విట్టర్‌లోరాసుకొచ్చింది.

రాజకీయ కారణాల వల్ల ‘లియో’ సినిమా ఆడియో లాంచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిని సెవెన్ స్క్రీన్ స్టూడియో ఖండించింది. రాజకీయ ఒత్తిళ్లు లేక మరే ఇతర కారణాల వల్ల ఆడియో లాంచ్‌ను రద్దు చేయలేదని సెవెన్ స్క్రీన్ స్టూడియో స్పష్టం చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 30న చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. లియో నిర్మాణ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లియో’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి లోకేష్ దర్శకత్వం వహించిన ‘ఖైది’కి, ‘విక్రమ్’కి లింక్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒకొక్క బాష కోసం డిఫరెంట్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

7 స్క్రీన్ స్టూడియో ట్విట్టర్..

విజయ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.