
నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ కీలక ట్వీట్ చేశారు. కరోనాలాంటి విపత్కర సమయంలోనే అందరం ఇళ్లలోనే ఉండటం వల్ల..వాతావరణానికి రోజుకు కొంచెం మేలు జరుగుతుందని… మాములు సమయాల్లోనూ పర్యావరణ పరిరక్షణకు సాయం చేయాలని అన్నారు. మహేశ్ తో పాటు పలువురు ప్రముఖుల సైతం భూమిని మనం పరిరక్షించుకోవాలంటూ సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట నిజమే. చెడులోనూ మంచిని వెతుక్కోవాలనట్లు కోవిడ్-19 వల్ల మనకు జరుగుతున్న మరో మేలు వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది.
Clear blue skies and roads devoid of pollution… While we’re all safe indoors, nature restores itself a little more each day. Let’s ensure we contribute to the healing process as much as we can, not only during the crisis but always?? pic.twitter.com/qmC8PV2lUZ
— Mahesh Babu (@urstrulyMahesh) April 22, 2020